సారా అర్జున్ కి చాలా సినిమాలు

TeluguCinema 01 Dec 2025
Sara Arjun

సారా అర్జున్ కి ఇప్పుడు 20 ఏళ్ళు. కానీ ఆమె 15 ఏళ్ల వయసులోనే క్రేజ్ తెచ్చుకొంది. మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాల్లో ఆమె యుక్తవయసులో ఉన్న ఐశ్వర్య రాయ్ పాత్ర పోషించింది. ఆ సినిమా పాపులారిటీతో ఆమెకి చాలా అవకాశాలు వచ్చాయి.

ఐతే, ఆమె ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇకపై ఆమె కెరీర్ అంతా హీరోయిన్ గానే. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం… ధురంధర్. రణ్వీర్ సింగ్ సరసన నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరోవైపు, ఆమె నటించిన ఇతర సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

గుణశేఖర్ తీసిన “యుఫొరియా”లో కూడా ఆమెది ప్రధాన పాత్రే. అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసిన “మేజిక్” సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.

TeluguCinema

View all posts

Recent News