దీపిక మమ్మీ ఫ్యాట్ పోయింది!

దీపిక పదుకోను గతేడాది ఒక పాపకు జన్మనిచ్చింది. తన కూతురికి ఆరునెలలు నిండగానే ఆమె మళ్ళీ మేకప్ వేసుకొంది. నటించడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఆమె వీరనారి పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసింది.
ఆ తర్వాత షారుక్ ఖాన్ సరసన “కింగ్” సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఐతే, మొన్నటివరకు ఆమె ఇంకా పోస్ట్ ప్రెగ్నన్సీ బాడీతోనే కనిపించింది. అంటే పూర్తిగా ఫిట్ నెస్ తో కనిపించలేదు. ఫోటోషూట్ లలో కూడా అలాగే దర్శనమిచ్చింది. ఐతే, ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ ఎక్కువ సాధించినట్లు అనిపిస్తోంది.
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ ఫోటోలు చూస్తే నడుము భాగం మినహా మిగతా అంతా గతంలోలా స్లిమ్ గా, ఫిట్ గా కనిపిస్తోంది. దాదాపుగా “మమ్మీ ఫ్యాట్” పోగొట్టుకొంది. అందుకే తాజాగా చేసిన ఫోటోషూట్ లో ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఫోజులు ఇచ్చింది.
సినిమా షూటింగ్ ల విషయంలో మాత్రం ఆమె ఇంకా తక్కువ గంటలు మాత్రమే పనిచేస్తాను అని చెప్తోంది. తల్లిగా తనకున్న బాధ్యతల కారణంగా గతంలోలా 12, 14 గంటలు పని చెయ్యను అని తేల్చి చెప్పింది. నైట్ షూట్ లకు కూడా నో చెప్తోంది. ఈ కండీషన్లకు ఒప్పుకుంటూనే సినిమాలు సైన్ చేస్తుందట.

ఈ కండీషన్ల కారణంగానే ఆమె ప్రభాస్ రెండు సినిమాలు వదులుకొంది. ఒకటి కల్కి 2. రెండో స్పిరిట్.