కృతి శెట్టికి 2026లోనే లక్కు తిరగాలి

TeluguCinema 18 Dec 2025
Krithi Shetty

కృతి శెట్టి కెరీర్ చాలా కష్టాల్లో ఉంది. ఆమె నటించిన సినిమాలేవీ ఇటీవల ఆడలేదు. ఇక తమిళ్ లోనైనా కొంచెం పరిస్థితి మారుతుందేమో అని ఆశపడింది. కానీ ఆమె అంచనాలు తప్పాయి. ఈ డిసెంబర్ లో విడుదల కావాల్సిన రెండు సినిమాలు చివరి నిమిషంలో వచ్చే ఏడాదికి నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఇక ఆమె లక్కు మారాలంటే 2026లోనే చూసుకోవాలి.

డిసెంబర్ 5న విడుదల కావాల్సిన “అన్నగారు వొస్తారు” (తమిళంలో వా వతియార్) జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ విడుదల కానుంది. ఆమెకి 2026లో విడుదల కానున్న మొదటి చిత్రం ఇది. ఇదొక్కటే కాదు డిసెంబర్ 18న థియేటర్లోకి రావలిసిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కూడా నిరవధికంగా వాయిదా పడింది.

ALSO READ: Krithi Shetty’s collage of selfies

“అన్నగారు వొస్తారు” చిత్రంలో ఈ భామ కార్తీ సరసన నటించింది. ఇక “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”లో ఆమె ప్రదీప్ రంగనాథన్ తో నటించింది. ప్రదీప్ ఇటీవల తమిళనాడులో చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. యువతలో మంచి పాపులారిటీ ఉంది. ఈ ఏడాది వరుసగా రెండు పెద్ద హిట్స్ ఇచ్చాడు. అవే డ్రాగన్, డూడ్. అతనికి ఉన్న క్రేజ్ తనకి హెల్ప్ అవుతుంది అని కృతి శెట్టి భావిస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా ఆమె లక్కు మారుతుంది. అందుకే కొత్త ఏడాది (2026)పైన చాలా ఆశలు పెట్టుకొంది.

kritishetty stills 181225 04

అలాగే వచ్చే ఏడాది జెనీ అనే మరో సినిమా కూడా విడుదల కానుంది. మొత్తంగా 2026లో ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలు విడుదల అవుతున్నాయి. మిగతా భాషల్లో కెరీర్ ఎలా ఉన్నా… ఆమెకి తమిళ్ కెరీర్ బాగుంది. మరింత బాగుండాలి అంటే 2026లో ఈ మూడు సినిమాలు హిట్ అవ్వాలి.