ప్రెగ్నన్ట్…అందుకే హడావిడిగా పెళ్లి!

TeluguCinema 12 Jul 2021
Evelyn Wedding Ceremony


ఇటీవల దియా మిర్జా పెళ్లి చేసుకొంది. పెళ్లి అయిన నెలకే గర్భవతిని అని ప్రకటించింది. కడుపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గర్భం దాల్చినట్లు కన్ఫర్మ్ అయ్యాకే, ఆమె హడావిడిగా పెళ్లి చేసుకొంది అని అప్పట్లో కామెంట్లు వినిపించాయి.

ఇప్పుడు మరో హీరోయిన్ అలాగే చేసినట్లు కనిపిస్తోంది.

‘సాహో’ వంటి సినిమాల్లో నటించిన ఎవ్లీన్ శర్మ గత నెలలో ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడింది. ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజగా తాను గర్భవతిని అని ప్రకటించింది. ఇలా పెళ్లి అయిన నెలకే మూడు, నాలుగు నెలల కడుపుతో కనిపిస్తుండడంతో జనాలు కామెంట్స్ మొదలు పెట్టారు.

ప్రెగ్నన్ట్ అని తెలిసిన తర్వాతే ఈ భామ కూడా హడావిడిగా పెళ్లి చేసుకొని ఉంటుంది అని మాట వినిపిస్తోంది.

https://www.instagram.com/p/CRLIJjph3JF/