చాంగురే ఐటెం సాంగ్ విడుదల

TeluguCinema 22 Jul 2021
changure itemsong

చాంగురే చాంగురే ఐటెం సాంగురే పాడుకుంటే రాతిరంత రాదు నిద్ద‌రే ఎప్పుడంటే అప్పుడే ఎక్క‌డంటే అక్క‌డే న‌న్ను చూస్తే ఎవ్వ‌డైనా పూల‌రంగ‌డే అబ్బ‌బ్బా ఇంతందంతో ఎట్టా స‌చ్చేది.. అబ్బ‌బ్బా మీ కుర్రాళ్ల‌ని ఎట్టా ఆపేది ధ‌వ‌ళేశ్వ‌రం ఆన‌క‌ట్ట తెంచిన‌ట్లు నాపై జ‌నం దూకుతుంటారే ...

ఇది కొత్త ఐటెం సాంగ్. విడుదలకు సిద్ధమైన “గ‌ల్లీరౌడీ”లో ఈ హాట్ పాట ఉంది. ఈ పాటలో హీటెక్కించే స్టెప్స్ వేసిన బ్యూటీ స్నేహ గుప్తా. “చాంగురే చాంగురే…” అనే ఈ ఐటెమ్ సాంగ్‌ను హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేసి సినిమా మంచి స‌క్సెస్‌ను సాధించాల‌ని యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం… “గ‌ల్లీరౌడీ”.

భాస్క‌రభ‌ట్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు. ప్రేమ్ ర‌క్షిత్ కొరియోగ్ర‌ఫీ చేశారు. సింగ‌ర్‌ మంగ్లీ త‌న‌దైన స్టైల్లో పాట పాడి.. పాట‌కు మంచి హుషారునిచ్చింది.

స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడు. డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=E04lnmCiZ6k