ఇన్నాళ్లకు స్టయిల్ మారింది!

TeluguCinema 08 Aug 2021
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు తన లుక్ ని మార్చడం లేదు అని చాలాకాలంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడన్న విషయం వాస్తవమే. అయినా కొంత కాలంగా ఆయన డల్ ఫొటోలే షేర్ చేస్తున్నారు. దాంతో అభిమానులు డీలాపడ్డారు.

ఇటీవల విడుదలైన ‘సర్కారు వారి పాట’ ఫోటోలో యాక్షన్ లుక్ ఉంది… కానీ స్టయిల్ లేదు. అభిమానుల కోరిక ప్రకారం లేటెస్ట్ గా అల్ట్రా స్టైలిష్ ఫోటోషూట్ చేసి వారిని అలరించారు మహేష్ బాబు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.

Also Check: Photos of Mahesh Babu’s dashing new look

మహేష్ బాబు ఎక్కువగా అవినాష్ గోవారికర్ అనే ఫోటోగ్రాఫర్ కి మాత్రమే ఫోటోషూట్ లు చేస్తుంటారు. మిగతా ఫోటోగ్రాఫర్ లని ఎంకరేజ్ చెయ్యరు. అందుకే, ఆయన ఫొటోల్లో వైవిధ్యం లోపిస్తోంది. అది మహేష్ బాబు గ్రహించాలి.

మరోవైపు, మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి ఒక కొత్త పోస్టర్. అలాగే డైలాగ్ తో కూడిన ఒక వీడియో టీజర్ (దానికి బ్లాస్టర్ అనే పేరు పెట్టారు) రానుంది. ఈ రెండూ… మహేష్ బాబు పుట్టిన రోజు స్పెషల్ గా ఆగస్టు 9న విడుదల అవుతాయి.