ఈసారైనా సుమ నిలబడేనా?

TeluguCinema 04 May 2022
Suma Kanakala

‘జయమ్మ పంచాయితీ’ అంటూ సుమ కనకాల మరోసారి ‘హీరోయిన్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పాతికేళ్ల క్రితం సుమ హీరోయిన్ గా పరిచయం అయ్యారు కానీ ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఆమె హీరోయిన్ వేషాలు బంద్ పెట్టి బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

బుల్లితెరపై ఆమె రారాణి. అనేక షోలు చేసి పాపులర్ అయ్యారు. అంతేకాదు, ఏ సినిమా ఫంక్షన్ జరిగినా ఆమె ఉండాల్సిందే. యాంకర్ గా ఫంక్షన్ ని నిర్వహించాల్సిందే. ఒక్కో ఈవెంట్ కి లక్షలు లక్షలు వస్తాయి. ఇన్నేళ్ల తర్వాత నటిగా ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలవుతోంది.

ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం… జయమ్మ పంచాయతీ. ఈ సినిమా ఈ వెకెండ్ (మే 6) థియేటర్లలో విడుదల కానుంది. మరి ఇప్పుడైనా ఆమెకి నటిగా విజయం దక్కుతుందా? ఇది సక్సెస్ అయితేనే మరిన్ని సినిమాలు చేస్తాను అంటున్నారు సుమ కనకాల.

ఇది రెగ్యులర్ చిత్రం కాదు. ఆమె హీరోయిన్ కాదు. ప్రధాన పాత్ర మాత్రం ఆమెదే. మరి బుల్లితెరపై ఆమెని తెగ ఆదరించిన జనం మరి వెండితెరపై ఆదరిస్తారా అన్నది చూడాలి.

TeluguCinema

View all posts

Recent News