రేణు రెండో ఇన్నింగ్స్ లుక్

TeluguCinema 29 Sep 2022
Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ మేకప్ వేసుకుంటున్నారు అనే వార్త పాతదే. ఆమె తనకి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్ కూడా చెప్పిందని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ రాసింది. ఇప్పుడు ఆ సినిమా నుంచి మొదటి లుక్ వచ్చింది.

రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సినిమా… టైగర్ నాగేశ్వరరావు. 1970 నాటి స్టువర్ట్‌పురం దొంగల నేపధ్యంలో సాగే మూవీ ఇది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. హేమలత లవణం సామాజిక అసమానతల, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పాత్రలో రేణు కనిపిస్తారు.

ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు.

వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.