మిలియన్ వ్యూస్ తో రెచ్చిపోదాం

Rechipodam Brother

కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో.. వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలను అందించారు.

ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయిన లిరికల్ సాంగ్‌ కి వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ సాంగ్‌ వచ్చాయట.

‘‘మాములుగా 1 మిలియన్ వ్యూస్ పొందాలంటే మాస్ బీట్ సాంగ్ లేదంటే లవ్ సాంగ్ అయితే.. అతి తొందరగా రీచ్ అయి వ్యూస్ సాధిస్తుంది. కానీ ఒక స్ఫూర్తిదాయకమైన సాంగ్‌ ఇంత త్వరగా 1 మిలియన్ వ్యూస్ సాధించిందంటే అందుకు సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం. భారీ తారాగణం, మంచి టెక్నీషియన్స్ ఉన్న ఈ సినిమా ‘జాగో’ పాటతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది,” అని అన్నారు దర్శకనిర్మాతలు.

#RechchiPodhamBrother | Jaago Lyrical | Songs | Sai Kartheek | Ravi Kiran,Dipali Sharma|Ak Jampanna

Related Stories