Advertisement
తెలుగు న్యూస్

ఆచార్య డేట్ చెప్పలేదెందుకు?


ఈ రోజు (ఆగస్టు 22) మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా ఎన్నో అప్డేట్స్ వచ్చాయి. ‘భోళాశంకర్’ టైటిల్ ప్రకటనతో పాటు ఆ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వీడియో కూడా విడుదల అయింది. ఇక బాబీ డైరెక్షన్ లో మరో సినిమా అంటూ ఒక పోస్టర్ వచ్చింది. “లూసిఫర్” సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు కూడా బయట పెట్టారు.

ఆదివారం మొత్తం సోషల్ మీడియా చిరంజీవి సినిమాల ప్రకటనలతో మోత మోగింది.

ఈ మొత్తం హడావిడిలో సింపుల్ గా తమ పని కానిచ్చింది ఒక్క “ఆచార్య” టీం మాత్రమే. మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ అంటూ ఒక రెగ్యులర్ పోస్టర్ ఒకటి విడుదల చేసి ఊరుకున్నారు మేకర్స్. సినిమా విడుదల తేదీ గురించి ఒక్క ముచ్చట లేదు. ఇంతకీ, ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది? దసరాకి వస్తుందా లేదా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు సంక్రాంతి 2022కే రానుందా?

రెండు పాటల షూటింగ్ మినహా “ఆచార్య” దాదాపు పూర్తి అయింది. తలుచుకుంటే దసరాకే విడుదల చెయ్యొచ్చు. కానీ ఎందుకనో, ఈ టీం సంక్రాంతి వైపే మొగ్గు చూపుతోంది. సంక్రాంతికి “ఆచార్య” విడుదలైతే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న “భీమ్లా నాయక్” వాయిదా పడాల్సి వస్తుంది. అందుకే, “ఆచార్య” రిలీజ్ డేట్ ప్రకటన గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

This post was last modified on August 22, 2021 11:14 pm

Advertisement
Share