పువ్వులు ఇలా పెట్టుకుంటారా?

పువ్వులిస్తే ఎవరైనా జడలో పెట్టుకుంటారు. కొంతమంది చెవిలో కూడా పెడుతుంటారు. అయితే హీరోయిన్ అదా శర్మ మాత్రం ఏకంగా పువ్వుల చెట్టు పెట్టుకుంది. అది కూడా ఎక్కడో తెలుసా? చెప్పడమెందుకు.. ఈ ఫొటోలో మీరు చూస్తున్నారుగా.. అక్కడ పెట్టుకుంది.

ఇప్పటివరకు పేపర్ ఛాలెంజ్ చూశాం, పిల్లో ఛాలెంజ్ చూశాం. పేపర్ చుట్టుకొని, దిండు అడ్డంగా పెట్టుకొని ఫొటో షూట్స్ చేశారు హీరోయిన్లు. ఇప్పుడు అదా శర్మ ఇలా పూల మొక్కల ఛాలెంజ్ విసురుతోంది. ఓపెన్ టాప్ గా రెడీ అయిన ఈ పిల్ల.. ఇలా తన టాప్ ను పూల మొక్కలతో అలంకరించింది. ఆ డ్రెస్ కు తోడు ఆమె హెయిర్ స్టయిల్ మరింత వెరైటీగా ఉంది.

Photos: Adah Sharma

ఇలా రకరకాలుగా తయారవ్వడం అదాకు బట్టర్ తో పెట్ట విద్య. టైమ్ దొరకాలే కానీ ఇలాంటి ప్రయోగాలు చాలానే చేస్తుంటుంది ఈ సిలంబం బ్యూటీ.  కొన్ని గంటల కిందట అదా శర్మ పెట్టిన ఈ పూలమొక్కల గెటప్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Related Stories