అమెరికాలో మళ్ళీ అడవిరాముడు

Adaviramudu


‘అడవిరాముడు’… స్వర్గీయ నందమూరి తారకరామారావు కెరీర్ లో ఒక సంచలన విజయం.1970లలో ఎన్టీఆర్ ని మాస్ హీరోగా కొత్తగా చూపించిన చిత్రం అది. బాక్సాఫీస్ పరంగా అనేక రికార్డులు సృష్టించిన చిత్రమది.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘అడవిరాముడు’ పాటలు ఎవర్ గ్రీన్ హిట్. రామారావు, జయప్రద… రామారావు, జయసుధలపై చిత్రీకరించిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’ ఇప్పటికీ ప్లే ఎక్కడో అక్కడ అవుతూనే ఉంటాయి.

ఆ సినిమాని ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు. అది కూడా అమెరికాలో. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 100 లొకేషన్ లలో ‘అడవిరాముడు’ మూవీ విడుదల కానుంది. ఈ స్క్రీనింగ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీకి వినియోగిస్తారు.

మే 28న విడుదల కానుంది ‘అడవిరాముడు’ సరికొత్తగా.

Advertisement
 

More

Related Stories