మెగాస్టార్ చిరంజీవికి మరోసారి అన్నీ కలిసి వస్తున్నాయి. పోటీలో ఉంటుంది అనుకున్న బడా హిందీ చిత్రం వాయిదా పడింది. ఇక మెగాస్టార్ సినిమాతో పోటీలో ఉన్న సూపర్ స్టార్ కొత్త సినిమా మొదటి పాట తుస్సుమంది.
ఇదంతా ‘భోళా శంకర్’ సినిమా గురించే.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానుంది. ఇదే డేట్ కి ఒక రోజు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోంది. ఈ రెండింటిలోనూ హీరోయిన్ తమన్నానే. తాజాగా ‘జైలర్’ సినిమా నుంచి “కావాలా” అనే పాట విడుదలైంది. అనిరుధ్ స్వరపర్చిన ఈ పాటలో దమ్ము లేదు. అనిరుధ్ ఇంతకుముందు స్వరపరిచిన పాటల్లానే ఉంది.
సో, “జైలర్” చిత్రానికి ఇంకా ఊపు రావడం లేదు.
మరోవైపు, “భోళా శంకర్”కి కలిసొచ్చే అంశం ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి హిట్ అందుకోవడం. అలాగే, ఇటీవల వచ్చిన టీజర్ “మాస్ మీటర్”లో ఉండడం కూడా అడ్వాంటేజ్.
మరి, చిరంజీవి ఈ ఏడాది ఇంకో కొట్టే అవకాశం ఉందా అనేది చూడాలి. కాకపోతే, ఈ సినిమా మాతృక ఒక తమిళ చిత్రం. అది వచ్చి చాలా కాలమే అయింది. రొటీన్ బ్రదర్ – సిస్టర్ సెంటిమెంట్ సినిమా అది. మరి, అలాంటి కథని ఇప్పుడు చూస్తారా అన్న డౌట్ కూడా ఉంది.
“OG 2”, the much-awaited sequel to “OG”, has taken a step forward. The team at…
Janhvi Kapoor has once again become the subject of social media chatter, this time because…
The much-awaited collaboration between Venkatesh Daggubati, Nandamuri Kalyan Ram, and director Anil Ravipudi is all…
Rashmika Mandanna starred in “Cocktail 2,” the spiritual sequel to the hit romantic drama “Cocktail.”…
Rumors about a possible relationship between Ram Pothineni and Bhagyashri Borse have once again become…
“Maa Inti Bangaaram” is continuing its impressive box-office run, particularly in North America, where the…