మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త చిత్రం… గుంటూరు కారం. ఈ సినిమా ప్రారంభంలోనే అనౌన్స్ చేసిన పేరు… పూజ హెగ్డే. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన షూటింగ్ లోనూ, ఆ తర్వాత జరిగిన షెడ్యూల్ ల్లోనూ పూజ హెగ్డే పాల్గొంది. దాదాపు 10 రోజుల పాటు నటించింది.
కానీ, ఇటీవల ప్రారంభం అయినా కొత్త షెడ్యూల్ కి ముందు ఆమె ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేశారు. దానికి ఎవరు కారణం అనే విషయంలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఐతే, మహేష్ బాబు ఒత్తిడి వల్లే దర్శకుడు త్రివిక్రమ్ ఆమెని ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చింది అనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట.
మహేష్ బాబుతో పూజ హెగ్డే గతంలో ‘మహర్షి’ వంటి హిట్ సినిమాలో నటించింది. ఐతే, ఈ సినిమా వరకు వచ్చేసరికి మహేష్ బాబు ఎందుకు ఆమెపై వ్యతిరేకత పెంచుకున్నారో తెలియదు. ఆమెకి వరుసగా ఫ్లాపులు ఉండడం ఒక కారణం కావొచ్చు. కానీ, ఈ కష్టకాలంలో తనకి ఈ సినిమా ఉండి ఉంటే తన కెరీర్ కి మళ్ళీ ఊపు వచ్చేది అనుకొంది పూజ హెగ్డే.
అందుకే, మహేష్ బాబుపై ఆమె కారాలు మిరియాలు నూరుతోందట.
ALSO CHECK: Pooja Hegde looks beautiful in all white
ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఒక్క తెలుగు చిత్రం లేదు. ఆమె ఇక మిడ్ రేంజ్ హీరోలతో నటించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఐతే, లక్కీగా ఆమెకి బాలీవుడ్ లో మాత్రం ఇంకా డిమాండ్ ఉంది. హిందీలో కూడా ఆమెకి హిట్స్ లేవు. అయినా ఎందుకనో బాలీవుడ్ లో మాత్రం ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి.
Akhil Akkineni and Bhagyashri Borse-starrer “Lenin,” which released in theatres on July 10, witnessed a…
The makers of “Ramayana,” one of the most anticipated films in Indian cinema, have officially…
Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, is all set to make her Telugu…
Pawan Kalyan underwent successful shoulder surgery at a hospital in Mumbai on Saturday morning. The…
Legendary playback singer S. Janaki passed away on Saturday at the age of 88 while…
Siddhu Jonnalagadda is looking to script a strong comeback after his last two films, "Jack"…