ట్రెండింగ్లో ‘ఐరనే వంచాలా ఏంటి?’

Airanevanchalaenti

విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్”లోని ఒక డైలాగ్ సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా టీజర్ వచ్చి చాలా రోజులైంది. ఆ టీజర్ లో ఉన్న డైలాగ్ ‘ఐరెనే వంచాలా ఏంటి..?’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఈ ట్రెండింగ్ చూసి ‘ఇంటర్నెట్ లో ఏం నడుస్తుంది…?’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత నిర్మాణ సంస్థ కూడా దాన్ని ఫాలో అయింది. ఈ సందర్భంగా కొందరు నెగిటివ్ గా ట్రోల్స్ కూడా చేశారు. అయినా కూడా విజయ్ దేవరకొండ పాజిటివ్ గా తీసుకున్నారు.

ఈ డైలాగ్ వైరల్ కాగానే ‘ఐరనే వంచాలా ఏంటి…?’ అనే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.

“ఫ్యామిలీ స్టార్” సినిమాకి డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories