Advertisement
తెలుగు న్యూస్

లవ్ సాంగ్ తో ఐశ్వర్య బిజీ!


ధనుష్, ఆయన భార్య విడిపోతున్నట్లు ప్రకటించి వారమైంది. మరి, ఇప్పుడు వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోర్టుకి వెళ్లి లీగల్ గా డివోర్స్ తీసుకోవడమేనా? లేదా మళ్ళీ కలిసిపోతారా? ఆ విషయం పక్కన పెడితే, ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజిగా ఉన్నారిప్పుడు.

ధనుష్ ‘సార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఇక ఐశ్వర్య కూడా హైదరాబాద్ కి వచ్చారు. ఆమె ఒక పాట చిత్రీకరించనున్నారు.

ఐశ్వర్యకి డైరెక్షన్ అంటే ఇష్టం. భర్త ధనుష్ హీరోగా ‘3’ అనే మూవీ కూడా తీశారు. ఆ సినిమాలోని ‘కొలవరి’ పాట బాగా వైరల్ అయింది. ఆమె మరో సినిమా తీసే పనుల్లో ఉన్నారు.

ప్రస్తుతం ఆమె ‘వాలెంటైన్ డే’ కోసం ఒక పాట చిత్రీకరిస్తున్నారు. టిప్స్ కంపెనీ కోసం ఈ పాటని ఆమె డైరెక్ట్ చేస్తున్నారు. రామోజి ఫిలిం సిటీలో ఈ పాట షూటింగ్ జరగనుంది. ధనుష్ గురించి, డివోర్స్ గురించి ఆమె ఆలోచించడడం లేదు. ఆమె కూడా కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

ధనుష్ కూడా హిందీలో మరో సినిమా చెయ్యనున్నాడు. ‘అత్రాంగి’ దర్శకుడితోనే ఆ మూవీ ఉంటుందట.

Advertisement

This post was last modified on January 25, 2022 4:26 pm

Advertisement
Share