అఖండ 2: ప్రచారంలో వెనక బడ్డారా?

TeluguCinema 04 Nov 2025
Akhanda 2 Thaandavam

సరిగ్గా 30 రోజుల టైం ఉంది … ‘అఖండ 2’ విడుదలకు. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. నెల రోజుల టైం మాత్రమే ఉంది కానీ ఈ టీం ఇంతవరకు పబ్లిసిటీ హంగామా షురూ చెయ్యలేదు.

ఇప్పటివరకు ఒక టీజర్ వచ్చింది. పాటల ప్రచారం మొదలు కాలేదు.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. అలాగే ఇది సూపర్ హిట్టయిన “అఖండ” సినిమాకి సీక్వెల్. కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే. అందుకే, ఎక్కువ ప్రచారం చెయ్యకపోయినా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని నమ్మకంగా ఉంది టీం.

“అఖండ 2″ని ఈ సారి హిందీ మార్కెట్ లో భారీగా విడుదల చెయ్యనున్నారు. తెలుగు వర్షన్ కి పెద్ద ప్రచారం చెయ్యకపోయినా హిందీకి మాత్రం భారీ పబ్లిసిటీ కావాలి. అలా చూసుకుంటే ఈ టీమ్ చాలా వెనకబడింది.