భర్తకి ఒకటి, భార్యకి ఒకటి

TeluguCinema 29 Jan 2024
Alia and Ranabir

“యానిమల్” సినిమాలో రణబీర్ కపూర్ నటన మాములుగా ఉండదు. అతనికి అవార్డులు ఇవ్వాల్సిందే. అందుకే, ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది. ఆదివారం జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో రణబీర్ కపూర్ డ్యాన్స్ కూడా చేశాడు.

పాపులర్ ఛాయిస్ కింద రణబీర్ కపూర్ కి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. ఇక ఆయన భార్యకి కూడా ఉత్తమనటిగా అవార్డు దక్కింది.

“రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని” చిత్రంలో అలియా భట్ ప్రదర్శించిన నటనకు అలియా భట్ కి ఈ అవార్డు లభించింది. రణబీర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అలియా భట్ ఆ సినిమాలో నటనని బెస్ట్ గా గుర్తించడం ఫిలింఫేర్ పై విమర్శలు వస్తున్నాయి.

భార్యాభర్తలు ఇద్దరూ ఉత్తమ నటులుగా చెరో అవార్డు అందుకోవడం మాత్రం అరుదుగా జరుగుతుంది అని చెప్పుకోవాలి.