సంయుక్త సినిమాలన్నీ లేట్

TeluguCinema 09 Dec 2025
Samyuktha about Akhanda 2

సంయుక్త ఒకటి కాదు రెండు కాదు ఆరు సినిమాల్లో నటిస్తోంది. ఒక్కటీ కూడా చెప్పిన టైంకి విడుదల కావడం లేదు. ఒక సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఒకటి రేపు విడుదల అనగా వాయిదా పడింది. మరోటి ఆరునెలలు వాయిదాపడి ఎట్టకేలకు మోక్షం చూస్తోంది. మరోటి షూటింగ్ దశలోనే ఉంది.

సంయుక్త చిత్రాలు ఇవి….

1) అఖండ

బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాలి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా సరిగ్గా డిసెంబర్ 4వ తేదీన సినిమా విడుదల ఆగిపోయింది. మొత్తానికి ఇప్పుడు అన్ని సమస్యలు తొలగించుకొని థియేటర్లలోకి రానుంది.

2) నారీ నారీ నడుమ మురారి

శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ సినిమా నిజానికి ఆరు నెలల క్రితమే విడుదల కావాలి. ఐతే దీనికి అప్పుడు బిజినెస్ కాలేదు. దాంతో నిర్మాతలు సినిమా విడుదల నిలిపివేశారు. ఇప్పుడు జనవరి 14, 2026 అని కొత్త డేట్ ప్రకటించారు. అలా ఆరునెలలు లేటుగా వస్తోంది. శర్వానంద్ సరసన సంయుక్త నటించడం ఇదే ఫస్ట్ టైం.

3) స్వయంభు

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, సంయుక్త హీరోయిన్ గా రూపొందిన “స్వయంభు” రెండేళ్లుగా రూపొందుతోంది. ఒక దశలో సినిమా ఆగిపోయింది అని చాలామంది భావించారు. కానీ, లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామంటూ తాజాగా మేకర్స్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 13న విడుదల కానుంది.

ఇవి కాకుండా… షూటింగ్ దశలోనే సమస్యలు ఎదుర్కొంటున్న చిత్రం.. మహారాజ్ఞి. ఇది పాన్ ఇండియా చిత్రంగా స్టార్ట్ అయి మధ్యలో ఆగిపోయింది.

ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన కూడా సంయుక్త నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.