అలా ‘అల్లు’కు పోయారు!

అల్లు కుటుంబం, కొణిదెల కుటుంబం మళ్ళీ కలిసిపోయింది. విబేధాలు పక్కనపెట్టి “అల్లు”కుపోయారు.
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం పెద్ద కర్మ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పెద్ది హీరో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల పక్కనే అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఆ ఫోటోలు బయటికి రావడంతో అల్లు అభిమానులు, కొణిదెల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అల్లు అర్జున్ “అతి”ని క్షమించాం ఇక అంటూ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అల్లు అర్జున్, అల్లు అరవింద్ కొన్ని నెలలుగా కొణిదెల కుటుంబంతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటి అల్లుడిగా మెగాస్టార్ చిరంజీవి ముందుగా మెత్తబడ్డారు. ఐతే, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం ‘అల్లు కనకరత్నం’ కన్నుమూత తర్వాతే పూర్తిగా కలిసిపోయినట్లు కనిపిస్తోంది.