అల్లు అర్జున్ భార్య వెరీ ఫిట్!

స్టార్ హీరో వైఫ్ అంటే దాదాపు స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంటుంది. వీరు అవసరాన్ని బట్టి కొన్ని ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. బై మిస్టేక్ కాస్త గ్లామర్ తగ్గిందో జనం ఆడేసుకుంటారు. అందుకే స్టార్ హీరోల మాదిరిగానే వీరు కూడా ఫిట్‌నెస్‌ను మెయిన్‌టైన్ చేయాల్సి ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఫిట్‌నెస్‌ను చాలా చక్కగా మెయిన్‌టైన్ చేస్తుంది. స్లిమ్‌గా కనిపించేందుకు ఆమె పడే కష్టం అంతా ఇంతా కాదు.

Advertisement

ఇటీవల ఆమె తన ఫిట్‌నెస్ రహస్యాన్ని సైతం వెల్లడించారు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామంతో పాటు ఇష్టమైన పనులు చేయడం.. హ్యాపీగా ఉండటం… మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి చేస్తూ తన ఫిటినెస్‌ని కాపాడుకుంటానని.. ఇవే తన బ్యూటీ సీక్రెట్స్ అని స్నేహా వెల్లడించారు.

ఇక 2023కి గానూ ఆమె న్యూ ఫిట్నెస్ గోల్స్ పెట్టుకున్నారట. ఇక మీదట పాత పద్ధతుల జోలికి వెళ్లనని కొత్త గోల్స్ పెట్టుకున్నానని వివరించారు. అవేంటో ఒక వీడియో ద్వారా వివరించారు. ఆ వీడియోతో పాటు.. ఆమె ఫిట్‌నెస్ కోసం వేసే యోగాసనాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇక స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ వైఫ్‌గానే కాకుండా ఆమెకు సొంత ఇమేజ్ కూడా బాగా కలిసొచ్చింది. ఆమెను ఇన్‌స్టాగ్రామ్ లో 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ట్రెండీ డిజైనర్ వేర్స్ ధరించి మెస్మరైజ్ చేస్తుంటారు. అలాగే ఫ్యామిలీతో కలిసి వెళ్లిన టూర్ తాలూకు ఫోటోలను సైతం అభిమానులతో స్నేహ పంచుకుంటారు.

Advertisement
 

More

Related Stories