సినిమాలు మానెయ్యను: అమల

హీరోయిన్ అమల పాల్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకొంది. ఆమె పెళ్లి ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందా లేక కంటిన్యూ చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. కెరీర్ కి ఎండ్ కార్డు వేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

గుజరాత్ కి చెందిన జగత్ దేశాయి ని ఈ భామ పెళ్లాడింది. ఇద్దరూ గోవాలో సెటిల్ అవుతారని టాక్.

మరి గోవాలో సెటిల్ అయితే సినిమాల సంగతి ఏంటి?

ఎక్కడ ఉన్నా తాను షూటింగ్ లకు వస్తాను అని చెప్పింది. ఆమె భర్త ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహిస్తారు. ముంబై, కొచ్చి, గోవా ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ ఉంటామని, కెరీర్ కి, సెటిల్ అయ్యే నగరానికి లింక్ లేదంటోంది. సినిమాలు ఎప్పుడూ మానెయ్యనని చెప్తోంది.

జగత్ దేశాయి, ఆమె చాలా కాలంగా డేటింగ్ చేసుకున్నారు. ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. వారానికి పెళ్లి కూడా చేసుకున్నారు.

Advertisement
 

More

Related Stories