వామ్మో.. అమితాబ్ కి 21 కోట్లా?

Amitabh Bachchan

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో పెద్ద కాస్టింగ్ ఉంది. హీరోయిన్ గా నటించేందుకు దీపికా పదుకోన్ ఒప్పుకొంది. అలాగే, కీలక పాత్ర పోషించేందుకు అమితాబ్ బచ్చన్ కూడా సై అన్నారు. ఐతే, ఈ పాత్ర కోసం అమితాబ్ గట్టిగానే డిమాండ్ బాలీవుడ్ టాక్. ఏకంగా 21 కోట్ల పారితోషికం ముట్టనుందట అమితాబ్ కి. ఇది నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మూవీ కావడంతో దానికి తగ్గట్లే తన పారితోషికాన్ని అమితాబ్ అడిగారని సమాచారం.

సినిమాకి అమితాబ్ పాత్ర చాలా ఇంపార్టెంట్. అందుకే, అంత భారీ మొత్తం ఇస్తున్నారట. ఇదే నిజం ఐతే, ఒక క్యారెక్టర్ రోల్ కి అంత భారీ పారితోషికం ఇచ్చిన నిర్మాతగా అశ్విన్ దత్ కి క్రెడిట్ వెళ్తుంది.

ఇంతకుముందు చిరంజీవి హీరోగా రూపొందిన “సైరా” సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషించారు. ఐతే, చిరంజీవితో ఉన్న స్నేహం కారణంగా ఆ సినిమాలో పాత్రకి అమితాబ్ పారితోషికం తీసుకోలేదు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత మొదలు అవ్వొచ్చు. ఈ గ్యాప్ లో ప్రభాస్ మరో రెండు సినిమాలు షురూ చేస్తున్నాడు.

Advertisement
 

More

Related Stories