సొంత ఇల్లు కొన్న లైగర్ భామ

Ananya Panday

అనన్య పాండే బాలీవుడ్ లో మంచి పేరున్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి చుంకీ పాండే ఒకప్పుడు బాగా బిజీ నటుడు. తండ్రికి మంచి ఆస్తి ఉంది. ఇల్లు ఉంది. కానీ, తనకంటూ ఒక ప్రత్యేకంగా ఇల్లు కావాలని ఈ భామ ఇప్పుడు ఇల్లు తీసుకొంది.

తెలుగులో “లైగర్” చిత్రంలో నటించిన ఈ భామ చేసిన తక్కువ సినిమాలతోనే బాగానే సంపాదించింది. యాడ్స్ ద్వారా కూడా భారీగా అమౌంట్ వస్తుంది ఆమెకి. అందుకే చిన్న వయసులోనే సొంత ఇల్లు కొనుక్కోగలిగింది ఈ భామ.

అనన్య పాండే వయసు కేవలం 25 ఏళ్ళు. నటించింది 6 చిత్రాలు. ఇంత తక్కువ వయసులో, చిన్న కెరీర్ తోనే ముంబైలో కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనుక్కొంది. దంతేరాస్ రోజు మంచి ముహూర్తం అని నిన్న గృహ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ.

“నా కొత్త ఇల్లు ఇది,” అంటూ ఆ ఇంట్లో పూజ చేస్తున్న ఫోటోని, వీడియోని షేర్ చేసింది. “లైగర్” ఫ్లాప్ కావడంతో మళ్ళీ తెలుగులో ఛాన్స్ రాలేదు. కానీ హిందీలో మాత్రం అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే “డ్రీంగర్ల్ 2” అనే సినిమాతో విజయాన్ని అందుకొంది.

Advertisement
 

More

Related Stories