లావు తగ్గలేదు, గ్లామర్ షో ఆపలేదు

అనసూయ ఇటీవలే 40వ పుట్టిన రోజు జరుపుకొంది. ఇద్దరు పిల్లల ఈ తల్లి బాగా లావు అయింది. ఆమె ఫిజిక్ గురించి ఇటీవల ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. “నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో, నేను ఎలా ఉండాలో… మీరు చెప్పక్కర్లేదు,” అని తనని ట్రోల్ చేసేవారి గురించి స్పందించింది. అందుకే లావు తగ్గలేదు.
ఐతే ఇటీవల జరిగిన కొన్ని వివాదాల కారణంగా ఈ అమ్మడు ఇక గ్లామర్ షో ఆపేస్తుందని భావించారు. కానీ అలాంటిదేమి లేదు అని తాజాగా ప్రూవ్ చేసింది.
చీర కట్టుకొని ఇటీవల ఫోటోషూట్ చేసింది. అందులో కూడా ఈ అమ్మడు బాగానే ఎక్స్పోజింగ్ చేసింది. కుర్రాళ్లకు ఏమి ఇష్టమో అలా ఫోజులిచ్చింది.
ALSO READ: Anasuya Bharadwaj’s mischievous look
ఐతే, బాగా లావు పెరగడం వల్ల అనసూయకి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిన మాట వాస్తవం. రంగస్థలం, పుష్ప వంటి భారీ హిట్ సినిమాల్లో నటించి ఒక టైములో బిజీబిజీగా గడిపిన అనసూయ 2025లో పెద్దగా ఎక్కువ సినిమాలు రాలేదు. 2026లో కూడా ఆమె నుంచి వచ్చే సినిమాల సంఖ్య తక్కువే ఉండేలా ఉంది.

ఐతే అనసూయకి షాపింగ్ ప్రారంభోత్సవాలు, సోషల్ మీడియా పోస్టులు, బ్రాండ్స్ వంటి ఇతర ఆదాయం ఎక్కువే.