అనసూయ తగ్గింది అందుకేనా!

- Advertisement -
Anasuya

అనసూయ భరద్వాజ్ కొంత కాలం వరకు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయేది. ముఖ్యంగా ట్రోలర్స్ తో గొడవ పెట్టుకునేది. ముందు ఎదో ఒక కామెంట్ చేసేది. అలాగే హీరో విజయ్ దేవరకొండపై సెటైర్లు వేసేది. ఆ తర్వాత ట్రోలర్స్ ఆమెని ఓ ఆటాడుకునేవారు. దానికి రివర్స్ గా ఆమె కూడా కొంత ఘాటుగానే వారికి రిప్లయ్ ఇచ్చేది. ఐతే, ఇటీవల ట్రోలింగ్ బ్యాచ్ మరింత రెచ్చిపోతున్నారు.

దాంతో, ఆమెకి మెంటల్ పీస్ పోయింది. మానసిక శాంతి కోసం ఆమె ఇప్పుడు పూర్తిగా తగ్గింది. మునుపటిలా కాంట్రవర్సియల్ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు.

దానికి తోడు, ఆమెకి ఇటీవల పెద్ద హిట్స్ ఏమి లేవు. “పుష్ప” తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. సో, ఇప్పుడు ఆమె కొంత

కొత్త ఏడాది 2024లో ఆమె ‘శాంతి ఒప్పందం’ పాటిస్తుందా లేదా మళ్ళీ ఎదో రోజు ఎదో విషయంలో కామెంట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతుందా అనేది చూడాలి.

 

More

Related Stories