ఇక అనిల్ సినిమాపై వెంకీ ఫోకస్!

Venkatesh

సీనియర్ హీరో వెంకటేష్ రెండో కూతురు పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. పెళ్లి పనులతో వెంకటేష్ బిజీగా ఉండి కొత్త సినిమా లాంచ్ చెయ్యలేదు. వచ్చే నెలలో కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నారు.

అనిల్ రావిపూడి తీసే ఈ సినిమాలో వెంకటేష్ తన ఏజ్ కి తగ్గ పాత్ర పోషించనున్నారట. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన “ఎఫ్ 2”, “ఎఫ్ 3” సినిమాల్లాగే ఇది కూడా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాకి “సంక్రాంతికి వస్తున్నారు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ సినిమాకి అనిల్ రావిపూడి ఈ సారి సంగీత దర్శకుడిని మార్చారు. “ఎఫ్ 2”, “ఎఫ్ 3” సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక బాలయ్యతో అనిల్ రావిపూడి తీసిన “భగవంత్ కేసరి” చిత్రానికి తమన్ పాటలు ఇచ్చారు. కానీ ఈ సారి “ధమాకా” సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోని తీసుకున్నారు.

ఇక వెంకటేష్ కూడా ఇటీవల యాక్షన్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. సో, ఇప్పుడు అనిల్ తీస్తున్న ఈ ఎంటర్టైనర్ పై పూర్తి ఫోకస్ పెడుతున్నారట.

Advertisement
 

More

Related Stories