‘గాలి సంప‌త్ ఆడియన్స్‌ని ‌థ్రిల్ చేస్తుంది’

Anil Ravipudi

ప‌టాస్, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు… ఇలా బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన “ఎఫ్ 3” తీస్తున్నారు. అలాగే తనే స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ ‌‌ చేసిన చిత్రం “గాలి సంప‌త్” రిలీజ్ కి రెడీ గా ఉంది. శ్రీవిష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషించారు ఇందులో. అనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా‌ అనిల్ రావిపూడి ఇంట‌ర్వ్యూ.

గాలి సంప‌త్ ఎలా మొద‌లైంది?
– నా ఫ్రెండ్‌ ఎస్‌.కృష్ణ నా అన్నిసినిమాలకు రైటర్‌గా పని చేశాడు. నిర్మాతగా లాంచ్‌ అవ్వాలని తను ‘గాలి సంపత్’‌ కథ రాసుకున్నాడు. గాలి సంపత్‌ అని విని…గాలికి తిరిగే ఓ వ్య‌క్తి క‌థ ఏమో అనుకున్నాను. కాని నోట్లో నుంచి మాట రాకుండా కేవలం గాలిమాత్రమే వచ్చేలా గాలి సంపత్‌ క్యారెక్టర్‌ ఉంటుంది అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదీకాకుండా నేను ఇంగ్లీష్ ఫిలింస్ కొన్ని చూశాను. క్యాస్ట్ అవే, లైఫ్ఆఫ్ పై. 127 అ‌వ‌ర్స్ ఇలాంటి జానర్ లో తెలుగు సినిమాలు. అలాగే ఒక గొయ్యిలో పడిన వ్యక్తి ఎలా పైకి వస్తాడు? అన్న కాన్సెప్ట్ న‌న్ను ఎగ్జైట్ చేసింది. దాంతో ఒక‌ సమర్పకుడిగా నేను గాలిసంపత్‌ టీమ్‌తో ట్రావెల్‌ అయ్యాను. ఒక టీమ్‌ వర్క్‌లా గాలి సంపత్‌ను పూర్తి చేశాం.

అనీష్ కృష్ణ డైరెక్షన్ ఎంత? మీ డైరెక్షన్ ఎంత?

దర్శకుడు అనీష్‌ చేసిన “అలా ఎలా?” సినిమా చూశాను. అనీష్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌. సెకాండాఫ్‌లో వచ్చే గొయ్యి సీన్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో చిత్ర యూనిట్‌ను డిస్ట్రబ్‌ చేయకుండా వారికి కావాల్సిన సహాయం చేశాను.

స్క్రిప్ట్‌ పరంగా హెల్ప్‌ చేశాను. అరకులోని హిల్‌ స్టేషన్‌లో జరిగే కథ ఇది. ఓ ఇంటి వెనక ఉన్న పాడుబడ్డ 30 అడుడుల బావిలో పడిన ఓ మాటలు రాని వ్యక్తి ఎలా భయటపడ్డాడు?. వర్షం పడినప్పుడు అతను ఎదుర్కొన్న పరిస్థితిలు ఏమిటీ? వాళ్లు ముందే ఆ బావిని ఎందుకు పూడ్చలేదు? అన్న అంశాల చూట్టూ గాలిసంపత్‌ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో నేచ‌ర్‌కి సంబందించిన ఒక బిగ్ ఎలిమెంట్ ఉంది. రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు తండ్రీ కొడుకులుగా చేశారు. వారితో పాటు వ‌ర్షం కూడా ఒక పాత్ర పోషించింది. నేచ‌ర్ అనేది విల‌న్‌లాగా ఫీల‌య్యే ఈ మాట‌లు రాని వ్య‌క్తి ఆ నేచ‌ర్‌తో ఎలా ట్రావెల్ అయ్యాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉంది. ఇవ‌న్ని క‌థ‌కు త‌గ్గ‌ట్టు బ్లెండ్ చేశాం.

రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు పాత్ర‌లు ఎలా ఉంటాయి?
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు, శ్రీ విష్ణు తండ్రీకొడుకులు. తండ్రిది ఒక లక్ష్యం. కొడుకుది మరొక లక్ష్యం. రెండు వేరు వేరు దారులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చోటుచేసుకునే ఈగో క్లాషెష్‌నే గాలిసంపత్‌ కథ. రాజేంద్రప్రసాద్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు యాక్ట్‌ చేశారు. బాగా చేశాడు. శ్రీ విష్ణుకు మంచి లవ్‌ట్రాక్ కూడా ఉంటుంది. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగడానికి ఈ లవ్ కూడా ఓ కారణం. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు ఈ సినిమాలో వర్షం కూడ ఓ విలన్‌లా కనిపిస్తుంది. అదీ ఎలా అనేది సినిమాలో చూడండి. ఆడియన్స్‌ తప్పకుండా థ్రిల్‌ అవుతారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలకు గాలిసంపత్‌ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.

క‌థ, స్క్రీన్ ప్లే మీకు కొత్త కాదు..ఈ సినిమాకి సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎలా అనిపించింది ?
దర్శకుడిగా వచ్చినప్పుడే హ్యాపీగా ఉన్నాను. సమర్పకుడిగా వచ్చినప్పుడు నిర్మాతకు ఉండే కష్టాలు తెలిశాయి. గాలిసంపత్‌ సినిమాకు సాహు, హరీష్‌లు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. సినిమా పరంగా ఇప్పటివరకు అయితే నిర్మాతలు సేఫ్‌. తక్కువ బడ్జెట్‌లోనే కంప్లీట్‌ చేశాం. లెక్కలు చెప్పలేను. మిర్చి సినిమాలో ప్రభాస్‌గారు చెప్పినట్లు ‘మనం సేఫ్‌’ అన్నారు. సాహుగారితో ఓ సినిమా చేయాలని సుప్రీమ్‌ టైమ్‌ నుంచే అనుకుంటున్నాను. కానీ కుదర్లేదు. త్వరలో వారితో కూడా ఓ సినిమా చేస్తాను.

‘ఎఫ్‌3’ అప్‌డేట్ ఏంటి?
‘ఎఫ్‌3’ షూటింగ్‌ 22 డేస్‌ చేశాం. ‘ఎఫ్‌ 2’ నచ్చిన వారంద‌రికీ ‘ఎఫ్‌ 3’ కూడా నచ్చుతుంది. ఇది ఎఫ్ 2కి సీక్వెల్‌ కాదు. ‘ఎఫ్‌ 2’ అనేది భార్యల గురించి ఫ్రస్ట్రేషన్‌ అయితే ఎఫ్‌ 3 డబ్బు గురించి ఫ్రస్ట్రేషన్‌. ఎఫ్ 2 కంటే మూడింత‌లు ఎక్కువ‌ న‌వ్విస్తుంది ఎఫ్‌ 3.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
బాల‌కృష్ణగారితో సినిమా చేయాల‌ని చాలా సార్లు అనుకున్నాం..ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. మ‌హేష్ బాబుగారితో మ‌రో సినిమా డిస్క‌ర్ష‌న్ స్టేజ్‌లో ఉంది. అలాగే రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.

హిందీలో కూడా “ఎఫ్ 2 ” రీమేక్ అవుతోంది కదా… డైరెక్ట్ చేసే ఛాన్స్ తీసుకోలేదెందుకు?
నేను నా సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలనుకుంటే “పటాస్”‌ను రీమేక్‌ చేస్తాను. ఆ సినిమా హృతిక్‌రోషన్‌తో చేయాలని ఉంది.

విల్లా కొన్నారటగా!
లైఫ్‌లో మనకు ఇల్లు, పని ముఖ్యం. పని ఎలాగూ చేస్తున్నాం..చేస్తాం..కాబ‌ట్టి కుటుంబం కోసం ఓ మంచి ఏరియాలో ఇల్లు తీసుకున్నాను.

Advertisement
 

More

Related Stories