ఆమె మళ్లీ ప్రేమలో పడింది?

anjali news

ఆ హీరోయిన్ కు తెలుగులో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కానీ కెరీర్ పరంగా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కారణంగా ఆమె క్రేజ్ పాతాళానికి పడిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడామెకు సినిమా అవకాశం రావడమే ఎక్కువ అన్నట్టు తయారైంది.

ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఆ హీరోయిన్ ఈమధ్య కాస్త స్లిమ్ అయింది కూడా. అయినా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో డేటింగ్ రూమర్స్ తో వార్తల్లోకెక్కింది ఆ ముద్దుగుమ్మ.

కోలీవుడ్ కు చెందిన ఓ వ్యక్తితో ప్రస్తుతం ఈ హీరోయిన్ డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు వస్తున్నాయి. ఆ వ్యక్తి కోలీవుడ్ స్మాల్ హీరో అని కొందరు అంటుంటే.. దర్శకుడని మరికొందరు వాదించుకుంటున్నారు. అయితే అమ్మడు లవ్ లో ఉన్నది మాత్రం పక్కా అంటున్నారంతా.

అన్నట్టు ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా డేటింగ్ వ్యవహారం నడిపింది. కానీ కొన్నాళ్లకు ఆ బంధం బెడిసికొట్టింది. కాస్త గ్యాప్ ఇచ్చి పిల్ల ఇప్పుడు ఫ్రెష్ గా మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసిందంటోంది కోలీవుడ్.

Related Stories