సెట్ లో రజనీ, ఫోటో వైరల్

Annaatthe set

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మళ్ళీ హైదరాబాద్ లోనే షూటింగ్ చేసేందుకు వచ్చారని ఇప్పటికే తెలుగుసినిమా. కామ్ పబ్లిష్ చేసింది. తాజాగా ‘అన్నాత్తే’ టీం ఈ సినిమా వర్కింగ్ స్టిల్ ని షేర్ చేసింది. ఆ ఫోటో వైరల్ గా మారింది. దర్శకుడు శివ, రజనీకాంత్ సెట్ లో నిల్చొని ముచ్చటిస్తున్న ఫోటోని షేర్ చేసింది.

సన్ పిక్చర్స్ సంస్థ ప్రస్తుతం తమిళంలో అన్ని భారీ సినిమాలే నిర్మిస్తోంది. విజయ్- పూజాహెగ్డే మూవీతో పాటు సూర్య 40వ చిత్రం కూడా నిర్మిస్తోంది. ఈ సంస్థ తమ సినిమాల అప్డేట్లని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఫోటోలని షేర్ చేస్తోంది.

‌ నాలుగు నెలల క్రితం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా రజనీకాంత్‌ అస్వస్థతకు లోనయ్యారు. దాంతో షూటింగ్ రద్దు అయింది. గత నెలలో కొన్ని సీన్స్ చెన్నైలో తీశారు. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ నటిస్తున్నారిందులో

More

Related Stories