ఈ ఏడాది ఇంకో మూడు

- Advertisement -
Anupama


మిగతా హీరోయిన్లతో పోల్చితే అనుపమ పరమేశ్వరన్ బిజీగా ఉన్నట్లు కనిపించదు. పెద్ద సినిమాలు కూడా సైన్ చెయ్యట్లేదు. కానీ, ఆమెకి అవకాశాలు మాత్రం ఫుల్లుగానే ఉన్నాయి.

ఈ ఏడాది ఆమె ఇప్పటికే ఒక (రౌడీబాయ్స్) మూవీ విడుదల చేసింది. ఇక విడుదలకు సిద్ధంగా మూడు ఉన్నాయి. “బటర్ ఫ్లై”, “కార్తికేయ 2”, “18 పేజెస్”… అనే మూడు చిత్రాలు షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్నాయి. వరుసగా విడుదల కానున్నాయి.

“బటర్ ఫ్లై” అనేది హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్. “కార్తికేయ 2”, “18 పేజెస్” చిత్రాల్లో హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ మూడు విడుదలైన తర్వాతే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తుందట. మరి, పెద్ద హీరోల సరసన ఎందుకు ఆఫర్లు రావడం లేదు? “పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తే చేస్తాను. లేదంటే లేదు. వాటి కోసం పరితపించను,” అని సమాధానం ఇస్తోంది.

ఈ అమ్మడు ప్రస్తుతం కేరళ, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతోంది. మాతృభాష మలయాళంలో పెద్దగా ఆఫర్లు వస్తున్నట్లు లేదు.

ALSO CHECK: Anupama Parameswaran in a stunning Saree

 

More

Related Stories