అనుష్క స్క్రీన్ పై బానే ఉంది!

Anushka Shetty

అనుష్క శెట్టి ఆ మధ్య బాగా లావుగా కనిపించింది. ఆ మధ్య అంటే అప్పుడెప్పుడో కాదు, రెండు నెలల క్రితమే. ఆమె ఫిట్ నెస్ గురించి అస్సలు ఆలోచించడం లేదు అనిపించింది. అందుకే, ఆమె సినిమాలు తగ్గించింది అనేది మాట.

ఐతే, తాజాగా విడుదలైన ఒక టీజర్ తో ఆమె ఫిజిక్, ఆమె పర్సనాలిటీపై ఉన్న అనుమానాలు తొలిగాయి. నిజజీవితంలో ఆమె ఎలా ఉన్నా స్క్రీన్ పై మాత్రం బాగుంది.

అనుష్క హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం… ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో అనుష్క సరసన యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించాడు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. అనుష్క ఇందులో చెఫ్ గా నటించింది. స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి నటించాడు. ఆమె లుక్స్ మాత్రం బాగున్నాయి. లావు ఉన్నా ఆమె ముఖంలో మునుపటి కళ ఉంది. సో, లుక్స్ పరంగా ఆమె పాస్ అయింది.

అనుష్క అందాల మెరుగు కోసం కొంతకాలంగా విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. ఆ మాటకొస్తే ఆల్మోస్ట్ పెద్ద హీరోలందరికీ, ముఖ్యంగా సీనియర్ హీరోలకు అలాంటి టెక్నాలజీ వాడుతున్నారు. అందుకే, నిజ జీవితంలో అనుష్క కొంచెం ఫిట్ నెస్ కి దూరంగా ఉన్నా… తెరపై మాత్రం బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.

Advertisement
 

More

Related Stories