మురుగదాస్ ఆడలేక చెప్తున్న కబుర్లు!

Admin 17 Aug 2025
AR Murugadoss

ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ తో తన గేమ్ అయిపొయింది అని శంకర్ నిరూపించుకున్నారు అనేది ఒక కామెంట్. అలాగే “థగ్ లైఫ్”తో మణిరత్నం, “కూలీ”తో లోకేష్ కనగరాజ్ విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యారు. ఒకప్పుడు అగ్ర దర్శకుల్లో ఒకరు అయిన మురుగదాస్ “స్పైడర్”, “దర్బార్”, “సికందర్” సినిమాలతో అందరినీ భయపెట్టారు. ఇప్పుడు అతన్ని హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

తాజాగా “మదరాసి” పేరుతో శివకార్తికేయన్ హీరోగా ఒక సినిమా తీసి, దాని ప్రచారంలో పాల్గొంటున్నాడు మురుగదాస్. ఈ సందర్భంగా తమిళ దర్శకులు ఎందుకు హిట్ సినిమాలు తీయలేకపోతున్నారు? తెలుగు దర్శకుల్లా పాన్ ఇండియన్ సినిమాలు చేయలేకపోతున్నారు అనే ప్రశ్న ఎదురైంది మురుగదాస్.

ఒకట్రెండు సినిమాలు పోయినంత మాత్రాన శంకర్ సార్, మణిరత్నం సార్ లను తక్కువ చెయ్యడం కరెక్ట్ కాదు అని మంచి సమాధానం ఇచ్చారు. ఎక్కడివరకు అతని కామెంట్ లో ఎలాంటి సమస్య లేదు. ఐతే, అదే ఫ్లోలో తమిళ దర్శకులు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తారు, “1000” కోట్లు హిట్ ఇచ్చే దర్శకులు కేవలం ఎంటర్ టైన్ చేస్తారు అన్నారు. అక్కడే సమస్య.

రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులు 1000 కోట్ల వసూళ్లు అందుకున్న సినిమాలు తీశారు. వీళ్ళ సినిమాల్లో వినోదం తప్ప మరేమి ఉండదు అన్నట్లుగా సాగింది అతని కామెంట్. దాంతో, మురుగదాస్ ని తెలుగు, కన్నడ ఫిలిం లవర్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేసే సినిమాలు తీయడం కేవలం తమిళ దర్శకుల ప్రత్యేకత అని మురుగదాస్ అన్నారు.

ఆడలేక ఇలాంటి కబుర్లు చెబుతున్నావు అంటూ అతన్ని విమర్శిస్తున్నారు.

Recent News