ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ లకు షాక్ తగిలింది. చెన్నైలోని ఓ కోర్టుకి ఏడాది జైలు శిక్ష వేసింది. అలాగే 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో వారికి ఈ శిక్ష పడింది.
మూడేళ్ళుగా సాగుతున్న కేసు ఇది. బుధవారం చెన్నైలోని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో శరత్ కుమార్, రాధికలది ఉద్దేశ్యపూర్వక తప్పే అని తేల్చింది కోర్టు.
రేడియన్స్ మీడియా అనే సంస్థ నుంచి కొన్నేళ్ల క్రితం కోటిన్నర రూపాయల అప్పు తీసుకొంది ఈ జంట. టీవీ, సినిమాల నిర్మాణం కోసమని తీసుకున్న అప్పు అది. ఆ తర్వాత శరత్ కుమార్ మరో 50 లక్షలు అవసరం ఉందని అదే సంస్థ నుంచి తీసుకొని 5 చెక్ లు ఇచ్చాడట. కొన్నాళ్ళకు ఆ సంస్థ బ్యాంకులో చెక్ వేస్తే అది బౌన్స్ అయ్యింది. ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రెండేళ్ల క్రితం కోర్టు అంగీకరించలేదు. ఈ కేసును ఆర్నెల్లలో తేల్చాలని స్పెషల్ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది సదరు కోర్టు.
ఈ రోజు ఫైనల్ తీర్పు వచ్చింది. ఇప్పుడు 5 కోట్ల పరిహారం కట్టాలి ఈ జంట. లేదంటే జైలు శిక్ష తప్పదు.
The "Lenin" trailer, starring Akhil Akkineni and Bhagyashri Borse, opens with a powerful voiceover by…
Satyadev and director Venkatesh Maha's much-awaited psychological drama "Rao Bahadur" is gearing up for its…
Young actor Akhil Raj Uddemari, who gained recognition with "Raju Weds Rambai", has responded to…
Virat Karna made his acting debut with "Peddha Kapu". Although the film failed to make…
Thiruveer and Aishwarya Rajesh are teaming up for the first time in the rural romantic…
Director Sudha Kongara has approached the Madras High Court over alleged unpaid remuneration of Rs…