రాధిక, శరత్‌కుమార్‌లకు శిక్ష

Radhika Sarath Kumar

ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ లకు షాక్ తగిలింది. చెన్నైలోని ఓ కోర్టుకి ఏడాది జైలు శిక్ష వేసింది. అలాగే 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో వారికి ఈ శిక్ష పడింది.

మూడేళ్ళుగా సాగుతున్న కేసు ఇది. బుధవారం చెన్నైలోని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో శరత్ కుమార్, రాధికలది ఉద్దేశ్యపూర్వక తప్పే అని తేల్చింది కోర్టు.

రేడియన్స్‌ మీడియా‌ అనే సంస్థ నుంచి కొన్నేళ్ల క్రితం కోటిన్నర రూపాయల అప్పు తీసుకొంది ఈ జంట. టీవీ, సినిమాల నిర్మాణం కోసమని తీసుకున్న అప్పు అది. ఆ తర్వాత శరత్ కుమార్ మరో 50 లక్షలు అవసరం ఉందని అదే సంస్థ నుంచి తీసుకొని 5 చెక్ లు ఇచ్చాడట. కొన్నాళ్ళకు ఆ సంస్థ బ్యాంకులో చెక్ వేస్తే అది బౌన్స్‌ అయ్యింది. ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రెండేళ్ల క్రితం కోర్టు అంగీకరించలేదు. ఈ కేసును ఆర్నెల్లలో తేల్చాలని స్పెషల్ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది సదరు కోర్టు.

ఈ రోజు ఫైనల్ తీర్పు వచ్చింది. ఇప్పుడు 5 కోట్ల పరిహారం కట్టాలి ఈ జంట. లేదంటే జైలు శిక్ష తప్పదు.

More

Related Stories