- Advertisement -

“అల వైకుంఠపురంలో” వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సెన్సషనల్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాని మొదటిసారి ప్రసారం చేసినప్పుడు అన్ని రికార్డులు బద్దలు అయ్యాయి. దాదాపు 30 పాయింట్ల రేటింగ్ వచ్చింది. అది ఆల్ టైం రికార్డు. అంత రేటింగ్ వచ్చిన సినిమాకి రెండోసారి ప్రసారం చేస్తే ఎంత రావాలి? కనీసం అందులో సగమైనా రావాలి కదా?
కానీ దీపావళి పండగకి రెండోసారి ప్రసారం చేస్తే.. కేవలం 7.93 రేటింగ్ మాత్రమీ వచ్చింది. అంటే ప్రీమియర్ కి వచ్చిన రేటింగ్లో పావు వంతు.
గతవారం టీవీ రేటింగ్స్ లో ఈ తెలుగు సినిమాకి చెప్పుకోదగ్గ రేటింగ్ రాలేదు. అల్లు అర్జున్, పూజ హెగ్డే నటించిన ఈ సినిమా పాటలు మాత్రం ఇప్పటికీ యూట్యూబ్ లో వ్యూస్ బాగా సంపాదిస్తున్నాయి.