బాహుబలి ఎపిక్: 3 రోజుల ముచ్చట

TeluguCinema 05 Nov 2025
Baahubali The Epic

ఎంతో హడావిడి చేశారు బాహుబలి ఎపిక్ గురించి. రెండు భాగాలను కలిపి, కుదించి “బాహుబలి ఎపిక్” అనే పేరు పెట్టి మళ్ళీ విడుదల చేశారు. రాజమౌళి స్వయంగా ప్రమోషన్ చూసుకున్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి మరోసారి రాజమౌళితో ఇంటర్వ్యూలు చేశారు. ఐతే, ఎంత హడావిడి చేసినా… ఇది రీ-రిలీజుల ట్రెండ్ లో మరో రీ-రిలీజ్ గానే జనం చూశారు.

దీన్ని ఇంకో కొత్త సినిమాగా ఎవరూ అనుకోలేదు. అందుకే మూడు రోజుల తర్వాత ఈ సినిమా వసూళ్లు తుస్సుమన్నాయి. అంతే కాదు, ఆ మొదటి రోజు, రెండో రోజు కూడా ప్రభాస్ అభిమానులు మాత్రమే చూశారు. సాధారణ ప్రేక్షకులు పట్టించుకోలేదు.

బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 2400 కోట్లు కొల్లగొట్టాయి. ఈ ఎపిక్ సినిమా ఇండియాలో ఐదు రోజులకు కలిపి 27 కోట్లు అందుకొంది. సోమవారం, మంగళవారం కోటి రూపాయల రేంజ్ లో కలెక్షన్ వచ్చింది. చాలా విచిత్రం ఏమిటంటే ఈ వసూళ్లలో కూడా 50 శాతం హైదరాబాద్ నుంచే వచ్చింది.

ఈ సినిమా ఈజీగా 100 కోట్లు అందుకుంటుంది అని ఫ్యాన్స్ హంగామా చేశారు. కానీ ఇండియాలో 30 కోట్లకే ఆగిపోయాలా ఉంది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపి మరో 12 కోట్లు రావొచ్చు.

TeluguCinema

View all posts

Recent News