గంట కొట్టిన బాలయ్య

TeluguCinema 08 Sep 2025
Balakrishna at NSE

పద్మభూషణ్ పురస్కారం, ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం, వరల్డ్ రికార్డు సన్మానం… ఇలా నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎన్నెన్నో సంబరాలు చేసుకుంటున్నారు. రికార్థులు సృష్టిస్తున్నారు. కెరీర్ పరంగా మంచి పీక్ చూస్తున్నారు బాలయ్య.

తాజాగా స్టాక్ ఎక్స్చేంజ్ లో గంట కొట్టారు. ఇది కూడా ఒక రికార్డు. ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ

బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి నందమూరి బాలకృష్ణ గారు ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)ని సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా NSE అధికారులు ఆయన గౌరవార్థం స్టాక్ ఎక్స్చేంజ్‌లోని గంట మోగించే అవకాశం కల్పించారు.

ఇక్కడ ఘటన మోగించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ నటుడు బాలయ్యనేనంట. ఇలా ఇంకో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.