భీమ్లా నాయక్ కొత్త రికార్డ్

Bheemla Nayak

ఒకప్పుడు కలెక్షన్ల రికార్డులు చూసి మురిసేవాళ్లు. అభిమానులకు అదొక అచీవ్ మెంట్ గా ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్, సోషల్ మీడియా లైక్స్ కూడా రికార్డులే. ఎన్ని హిట్స్, ఎన్ని లైక్స్ వస్తే…అంత పాపులారిటీ అన్నమాట. సో… వీటికి కూడా క్రేజ్ పెరిగిందిప్పుడు.

తాజాగా విడుదలైన “భీమ్లా నాయక్” మొదటి Glimpse వీడియో ఆదివారం విడుదలైంది. 24 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ పొందింది. అలాగే, 7 లక్షల లైకులు అందుకుంది. ఇది ఇండియాలోనే రికార్డు అంట.

ఈ రికార్డుల మాట ఎలా ఉన్నా… ఈ వీడియో మాత్రం క్లిక్ అయింది. అభిమానులకు ఊపు వచ్చింది పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్ చూసి. ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ వంటి ఇతర పెద్ద సినిమాల నడుమ ఈ Glimpse వీడియో వచ్చింది. అయినా ఇంత అలజడి సృష్టించింది. పవన్ కళ్యాణ్ మాస్ పవర్ అది.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొదటి పాట వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇందులో నా దగ్గుబాటి మరో హీరో.

Advertisement
 

More

Related Stories