
భూమిక ఇప్పుడు హీరోయిన్ వేషాలు వెయ్యడం లేదు. అక్క, వదిన వంటి పాత్రలు చేస్తున్నారు. ఐతే, తనతో హీరోగా నటించిన వాళ్ళు ఇంకా హీరోగానే నటిస్తున్నారు. అంతే కాదు, వాళ్ళు తమ కన్నా 20 ఏళ్ళు చిన్నవారితో సినిమాల్లో రొమాన్స్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె తనకి కూడా కుర్రాళ్లతో నటించాలని ఉంది అని అంటున్నారు.
“నేను కూడా యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోలతో ఎందుకు రొమాన్స్ చెయ్యకూడదు. వారితో నేను కూడా జతకడితే తప్పేంటి. ఇప్పుడు పెద్ద హీరోలందరూ తమ కన్నా 20, 25 ఏళ్ల చిన్నవారితో డ్యూయెట్లు పాడుతున్నారు కదా,” అని భూమిక తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.
భూమిక వయసు ఇప్పు 44 ఏళ్ళు.

ఐతే, హీరోలకు ఉన్న క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. 60 ఏళ్ళు వచ్చినా హీరోలు పాతికేళ్ల భామలతో డ్యూయెట్లు పాడుతారు. కానీ, హీరోయిన్లకు 35 దాటితే కష్టం. 40లో కూడా హీరోయిన్లుగా నటించే వారి సంఖ్య చాలా తక్కువ.