
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన “అఖండ 2” ప్రస్తుతం థియేటర్లో నడుస్తోంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కావడం, 3Dలో రిలీజ్ కావడం ఇదే ఫస్ట్ టైం. అందుకే, బోయపాటి ప్రేక్షకులను ముఖ్యంగా ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళను మరోసారి 3Dలో చూడమని కోరుతున్నారు.
“మొత్తం సినిమాని 3Dలో చేశాం. 3Dలో అనుభూతి వేరేగా ఉంటుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఇక్కడ ప్రసాద్స్ లో ఆ 3D అనుభూతి కూడా పొందామని కోరుతున్నాను,” అని ఈ రోజు బోయపాటి మీడియా ముందు కోరారు.
మొదటి రోజు మంచి కలెక్షన్లు ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. “ఇది సినిమా కాదు భారతదేశ ఆత్మ. కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా,” అని బోయపాటి పేర్కొన్నారు.
ఈ సినిమా కోసం హిమాలయ ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, ఫైట్స్ అలాగే రియల్ గా మహాకుంభా మేళా సమయంలో చిత్రీకరించిన దృశ్యాలు 3Dలో ఎక్కువ అనుభూతిని ఇస్తాయని బోయపాటి భావన.





