బోయపాటి తమిళ ఎంట్రీ!

Boyapati


సింహ, సరైనోడు, లెజెండ్, అఖండ… వంటి సినిమాలతో దర్శకుడు బోయపాటి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరొందారు. బాలయ్య, బోయపాటి కలిస్తే ఆ లెక్క వేరు. ఐతే, ఇప్పుడు తమిళ హీరో సూర్యని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు బోయపాటి.

తమిళ హీరో సూర్య విభిన్న చిత్రాలు చేస్తూనే “సింగం”/”యముడు” వంటి పక్కా మాస్ చిత్రాలు చేస్తూ ఉంటారు. సూర్యకి బోయపాటి మార్క్ సినిమాలు కూడా నచ్చుతాయంట. అందుకే బోయపాటితో సినిమా చేసేందుకు సూర్య ఒప్పుకున్నారు అని సమాచారం.

వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అని చాలా కాలంగా వినిపిస్తోంది. ఐతే తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ సూర్య – బోయపాటి కాంబినేషన్ ని సెట్ చేసింది అని అంటున్నారు. అల్లు అర్జున్ – బోయపాటి కాంబినేషన్ లో సినిమా తీద్దామని అల్లు అరవింద్ భావించారు. కానీ, అల్లు అర్జున్ త్రివిక్రమ్, అట్లీ, నెల్సన్… ఇలా కాంబినేషన్ లు సెట్ చేసుకుంటున్నాడు. ఆ లిస్ట్ లో బోయపాటికి ఛాన్స్ ఇప్పుడే రాకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా అల్లు అరవింద్ సూర్యతో మాట్లాడారు అని అంటున్నారు.

రామ్‌ హీరోగా బోయపాటి డైరెక్ట్ చేసిన ‘స్కంద’ వచ్చేవారం విడుదల కానుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి సూర్య ఒక నిర్ణయానికి రావొచ్చు.

Advertisement
 

More

Related Stories