క్యాథరీన్ కూడా అదే రూట్లో

- Advertisement -


ముద్దుగా బొద్దుగా ఉండే క్యాథరీన్ లీడింగ్ హీరోయిన్ అవుతుందని భావించారు సినిమా విశ్లేషకులు. “ఇద్దరమ్మాయిలతో”, “మద్రాస్”, “రుద్రమదేవి”, “సరైనోడు”, “నేనే రాజు నేనే మంత్రి” వంటి సినిమాలతో ఆమె టాప్ గేర్ లో దూసుకుపోతోంది అనిపించింది. కానీ, గత మూడేళ్ళుగా ఆమె జోరు తగ్గింది

ఎన్నో ఆశలు పెట్టుకొని విజయ్ దేవరకొండ సరసన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చేస్తే… అది ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుంచి అవకాశాల కోసం కుస్తీ పడుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసార”తో పాటు”భళా తందనాన” అనే మరో చిత్రంలో నటిస్తోంది. కానీ పెద్ద సినిమాలు రావట్లేదు.

అందుకే, అవకాశాల కోసం అందరి హీరోయిన్ల రూట్ లోనే ఇన్ స్టాగ్రామ్ లో అందాల కనువిందు చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్ ఫోటోలు పెడుతోంది. ఈ గ్లామర్ షోతోనైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశపడుతోంది కాబోలు.

ALSO CHECK: Catherine Tresa’s sizzling pose

30 ఏళ్ళ ఈ సుందరి కేరళ కుట్టి. కానీ ఆమె కెరియర్ అంతా తెలుగు, తమిళ చిత్రాల్లోనే సాగింది. టాలీవుడ్ లోనే మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

 

More

Related Stories