Advertisement
తెలుగు న్యూస్

ఛత్రపతికి ఆ ఇద్దరిలో ఎవరు?


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లనందరిని అడిగారు. పారితోషికం భారీగా ఇస్తామని అఫర్ చేసినా ఎవరూ అంగీకరించలేదు.

రీసెంట్ గా రెజీనా కన్ఫర్మ్  అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. బాలీవుడ్ లో పేరున్న హీరోయిన్నే తీసుకోవాలనేది బెల్లంకొండ పట్టుదలగా ఉన్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకు రిజిస్టర్ కావాలంటే తప్పదు. అతికష్టమ్మీద ఫైనల్ గా ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లని ఒప్పించగలిగారు. కానీ, వాళ్ళు డేట్స్ అవి చూసుకొని చెప్తామని నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టారట. ఈ నెలాఖరులోపు వాళ్ళు తమ డెసిషన్ తెలిపాలి. హీరోయిన్ తో ఉన్న సీన్లను వచ్చే నెలలో తీద్దామని ప్లాన్ చేస్తున్నారు మరి.

ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న ఒక యువ బాలీవుడు హీరోయిన్ ఒప్పుకున్నట్లే ఒప్పుకొని చివర్లో నో చెప్పింది. ఎందుకంటే, ఆమెకి ఒక అగ్ర టాలీవుడ్ హీరో సరసన నటించే అవకాశం దక్కనుంది.

‘ఛత్రపతి’ రీమేక్ కి కూడా ‘ఛత్రపతి’ అనే పేరునే హిందీలో ఫిక్స్ చేశారు. ఈ హిందీ సినిమాకి దర్శకుడు మన తెలుగు డైరెక్టర్ వివి వినాయక్. కాకపోతే, బాలీవుడ్ నిర్మాణ సంస్థ తీస్తోంది. ‘ఛత్రపతి’ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టాలన్న తన నిర్ణయాన్ని ప్రభాస్ కూడా అభినందించారు అని చెప్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ నెలలోనే ఆ హీరోయిన్ ఎవరూ అనేది తెలుస్తోంది.

Advertisement

This post was last modified on August 3, 2021 2:44 pm

Advertisement
Share