Advertisement
తెలుగు న్యూస్

విమర్శలను పట్టించుకోని మందిర


సీనియర్ నటి మందిర బేడీ తన జీవితంలోని విషాదాన్ని దిగమింగుకొని రెగ్యులర్ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఆమెకి ఎక్సర్ సైజ్, యోగ అంటే పిచ్చి. అందులోనే ఆమెకి మానసిక ప్రశాంతత దక్కుతుందట. అందుకే, భర్త చనిపోయిన నెల రోజుల్లోనే ఆమె వర్కౌట్ మొదలుపెట్టారు.

తన కూతురు అడిగిందని ఆమె మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేశారట. మందిరకి 49 ఏళ్ళు. కానీ వర్కౌట్స్ కారణంగా ఆమె ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తారు.

ఐతే, భర్త చనిపోయిన నెల రోజులకే ఆమె ఎక్సర్ సైజులు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై నెగెటివ్ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. కానీ అవేవి ఆమె పట్టించుకోవడం లేదు. తన భర్త అంత్యక్రియలకు ఆమె జీన్స్ లో వెళ్లడంపై కూడా విమర్శలు వచ్చాయి.

తెలుగులో ‘సాహో’ వంటి చిత్రాల్లో నటించిన మందిర బేడీ ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కొత్తగా సినిమాలు ఒప్పుకునే ఆలోచనలో ఉన్నారట. కానీ గతంలోలా ఎక్కువ సినిమాలు చెయ్యదట.

Advertisement

This post was last modified on August 3, 2021 2:24 pm

Advertisement
Share