దీపిక కొత్త ఇల్లు @119 కోట్లు!

Deepika Padukoneదీపిక పదుకోన్ బాగా రిచ్. ఆమె భర్త రణ్వీర్ సింగ్ మరింత రిచ్. ఇద్దరూ సూపర్ స్టార్స్. ఇద్దరూ కలిసి ఇప్పటికే వందల కోట్లు సంపాదించారు. మరి, అంత సంపాదించినప్పుడు దానికి తగ్గట్లు లైఫ్ స్టయిల్ ఉండాలి. అందుకే, లేటెస్ట్ గా ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రాలో కొత్త ఇల్లు తీసుకున్నారు.

షారుఖ్ ఖాన్ ఇంటికి దగ్గర్లోనే ఫ్లాట్ కొన్నారు. దాని ఖరీదు అక్షరాలా 119 కోట్ల రూపాయలు. ఒక పెద్ద అపార్టుమెంట్లో నాలుగు ఫ్లోర్లలో వీరి ఇల్లు. 19 కార్లు పెట్టుకునేలా పార్కింగ్. పనివాళ్ళకి రూమ్స్ కూడా ఇందులోనే. తమ అభిరుచికి అనుగుణంగా ఇంటీరియర్ చేయించుకుంటున్నారట. దానికి కోట్లు ఖర్చు అవుతుంది.

దీపిక కోరిక మేరకు ఈ కొత్త ఇల్లు తీసుకున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి వెతికితే ఇప్పుడు దొరికిందట.

రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. ఇక, దీపిక మన దేశంలో అత్యధిక పారితోషికం పొందే హీరోయిన్.

 

More

Related Stories