దేవర క్వాలిటీ అదుర్స్!

- Advertisement -
Devara

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తీస్తున్న “దేవర” చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారు. ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ జరుగుతోంది. “ఆర్ ఆర్ ఆర్” చిత్రం తర్వాత ఎన్టీఆర్ కి గ్లోబల్ స్థాయిలో పెరిగిన పాపులారిటీ కారణంగా “దేవర” సినిమా విజువల్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు.

క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ ఈ రోజు మీడియాకి తెలిపారు.

“RRR వంటి సినిమా చేసిన తర్వాత ఎంతో బాధ్యత ఉంటుంది. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా తీస్తున్నాం. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం దేవర మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం,” అన్నారు కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్ కి, దర్శకుడు కొరటాల శివకి ఇది చాలా ముఖ్యమైన సినిమా. “ఆర్ ఆర్ ఆర్” తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీని గ్లోబల్ మార్కెట్ లో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్లు “దేవర” అవుట్ ఫుట్ ఉండాలి. ఇక “ఆచార్య” వంటి డిజాస్టర్ తో కొరటాల శివ పేరుకి, బ్రాండ్ నేమ్ పడింది. ఇప్పుడు మళ్ళీ హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలి.

More

Related Stories