ధనుష్: 2025లో మూడు భాషల్లో

TeluguCinema 04 Dec 2025
Dhanush

ధనుష్ ఈ ఏడాది తెలుగులో యావరేజ్ విజయం చూశాడు. శేఖర్ కమ్ముల తీసిన “కుబేర” సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. మోస్తరు విజయం కూడా వచ్చింది. ఆ సినిమా తమిళంలో, హిందీలో ఆడలేదు కానీ తెలుగులో ఓకె అనిపించుకుంది.

ఇక తమిళంలో “ఇడ్లీ కడాయి” (తెలుగులో ఇడ్లీ కొట్టు) పేరుతో ఒక సినిమా డైరెక్ట్ చేసి విడుదల చేశాడు. అందులో అతనే హీరో. తమిళనాట ఫర్వాలేదు అన్నట్లుగా ఆడింది. తెలుగులో ఢమాల్ అయింది. దర్శకుడిగా, హీరోగా తమిళనాట తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా హిందీ సినిమా కూడా విడుదల అయింది.

“తేరే ఇష్క్ మే” అనే పేరుతో దర్శకుడు ఆనంద్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత వారం విడుదలైంది. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. మొదటివారం ఇండియాలో 70 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కూడా యావరేజ్ చిత్రం. ఇలా మూడు వేర్వేరు భాషల్లో హీరోగా నటించి, ఆ మూడింటిని ఒకే ఏడాది విడుదల చేసి యావరేజ్ రేంజ్ సక్సెస్ అందుకోవడం ధనుష్ కి దక్కిన క్రెడిట్.

మూడు భాషల్లో ధనుష్ కి మార్కెట్ ఉంది. ఐతే, ఏ ఒక్క సినిమాని పాన్ ఇండియా లెవల్లో అంటే అన్ని భాషల్లో హిట్ చెయ్యలేకపోతున్నాడు. ఏ భాషలో నటిస్తే ఆ భాషల్లోనే ఆడుతోంది. మరో భాషలో డబ్బులు రావడం లేదు.