అతనితో ఇంకో హిందీ మూవీ

Dhanush

ధనుష్ మరో హిందీ సినిమా ఒప్పుకున్నాడు. రాన్ ఝానా (Raanjhanaa) విడుదలై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ దర్శకుడు కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఇందులో కూడా ధనుష్ ని ఒక హీరోగా తీసుకున్నాడు ఆ దర్శకుడు.

ఆ దర్శకుడి పేరు ఆనంద్ ఎల్ రాయ్. ‘అత్రాంగి రే’ అనే మరో సినిమాలో కూడా అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరో సరసన ధనుష్ ని పెట్టి తీశాడు ఆనంద్ రాయ్. ధనుష్ తో అలాంటి స్నేహం ఆయనది. తాజాగా ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాని ధనుష్ హీరోగా ప్రకటించారు.

ధనుష్ ఏడాదికి రెండు, మూడు సినిమాల్లో నటిస్తాడు. అలాగే తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్…ఇలా అన్ని ఒప్పుకుంటాడు. అతని నటన కూడా అలాగే ఉంటుంది. ఏ భాషలో నటించినా మెప్పించగలడు. ఒక హాలీవుడ్ బడా యాక్షన్ చిత్రంలో కూడా నటించాలిగాడు అంటే మాటలు కాదు కదా.

ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా ఒప్పుకొని చాలా కాలమే అయింది. మరి అది ఎప్పుడు చేస్తాడో. కొత్తగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. పైగా తన డైరెక్షన్లోనే ఒక తమిళ సినిమా కూడా త్వరలో తీయనున్నాడు.

Advertisement
 

More

Related Stories