ఓటిటిలో ధనుష్ మూడో చిత్రం

ధనుష్ నటించిన ‘జగమే తందిరం’ థియేటర్లలో విడుదల కాలేదు. ఆ తర్వాత హిందీలో నటించిన ‘అత్రాంగి రే’ కూడా డైరెక్ట్ గా ఓటిటి వేదికపైనే విడుదలైంది. వరుసగా రెండు చిత్రాలు ఓటిటి రిలీజ్ లోనే కావడంతో ఇప్పుడు కొత్త సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాడని అనుకున్నారు.

కానీ హ్యాట్రిక్ గా మూడో సినిమాని కూడా ఓటిటికే ఇచ్చేశాడు ధనుష్.

“మారన్” అనే కొత్త తమిళ చిత్రం త్వరలోనే డైరెక్ట్ గా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఇది థియేటర్లో విడుదల కాబోవడం లేదు. మార్చి 11న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తారట. తాజాగా ట్రైలర్ వచ్చింది. ఇది యాక్షన్ థ్రిల్లర్. కార్తీక్ నరేన్ అనే దర్శకుడు తీసిన ఈ చిత్రంలో ధనుష్ సరసన మాళవిక మోహనన్ నటిస్తోంది. ధనుష్ ఇందులో జర్నలిస్ట్ గా కనిపిస్తాడు.

ధనుష్ ఇటీవలే తన భార్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇక తెలుగులోకి ‘సార్’ అనే చిత్రంతో అడుగుపెడుతున్నాడు.

Advertisement
 

More

Related Stories